Skip to content

Namah Shivaya Geyamrutham Lyrics In Telugu – శ్రీ నమః శివాయ గేయామృతం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

శ్రీ నమశ్శివాయ గేయామృతము

నమశ్శివాయ, నమశ్శివాయ నమశ్శివాయా,
ఓం నమశ్శివాయా ||

1.  నమశ్శివాయని నా మనసందున
నభినుతి జేసెద ననుకడతేర్చుము || ఓం ||

2. నమశ్శివాయను మంత్రము నానా
నరకములను తెగద్రుంచునయా || ఓం ||

3. అతి దీనుడనై అనుదినమును నిను
మదిలో దలచెద బ్రోవుమయా || ఓం ||

4. పతితపావన పన్నగధారణ
పాలన జేయవె దయామయా || ఓం ||

5. ఎంతని వేడుదు పంతము నాపై
సుంతయు దయ రాదేలనయా || ఓం ||

6. శంభో హర హర మహదేవా
నీ చరణములే గతి యంటినయా || ఓం ||

7. అండ పిండ బ్రహ్మాండములంతట
నిండిన జ్యోతివి నీవేనయా || ఓం ||

8. ఆదియు మధ్యము నంతము దెలియని
ఆనందామృత తత్త్వమయా || ఓం ||

9. ఇంద్రుడాదిగా సకల సురలకును
ఇష్టదైవమగు మూర్తివయా || ఓం ||

10. ఈశ్వర నా మొర నాలకింపవే
శాశ్వత గుణగణ సత్యావన || ఓం ||

11. ఉరగ విభూషణ నీదగు నామము
మరువగ జాలర మానసమున || ఓం ||

12. ఊరడించి నను గానకయుండిన
నోపజాల గతి నీవేనయా || ఓం ||

13. ఋతువులు మాసములెన్నో గడచెను
వెతలుదీర్చ వెటుబోదునయా || ఓం ||

14. ఎందుకు నీ దయ రాదు పరాత్పర
మందుడనని కడుకోపమయా || ఓం ||

15. ఏమియు దెలియని దీనుడనైతిని
పామరముడిపియు పాలింపవె || ఓం ||

16. ఐక్యస్వరూపము దెలిపిన జాలుర
ఆనందాంబుది మునుగుదురా || ఓం ||

17. ఒకటి రెండు మూడక్షరములలో
సకలంబునకును సాక్షివయా || ఓం ||

18. ఓంకారాత్మకమయమగు బ్రహ్మము
నొందెడు మూలము తెల్పుమయా || ఓం ||

19. ఔరా యేటికి నీదయ రాదుర
అంతకఠినమా హరహరహర || ఓం ||

20. అంతయు నీవై యుండగ వేణే
చింతలు నాకిక నేలనయా || ఓం ||

21. ఆలకింపు మిక నాదగు మనవిని
అరమరసేయకు ఆదిదేవ || ఓం ||

22. అహర్నిశంబును నీదగుమంత్రము
ననుసంధింపగ జేయుమయా || ఓం ||

23. కమలసంభవాద్యమరగణావన
కంజలోచనా భవమోచనః || ఓం ||

24. ఖగవాహనప్రియ కరుణాసాగర
కంతుమదాపహరా హర || ఓం ||

25. ఘనమౌ నీదగుకీర్తిని వినినే
మనమున నమ్మితి గావుమయా || ఓం ||

26. జ్ఞాతృజ్ఞానజ్ఞేయము లొకటై
గాంచిన నీదయగల్గునయా || ఓం ||

27. చదువులలోపలి చదువై వెలసిన
సారము గ్రోలిన చాలునయా || ఓం ||

28. జనన మరణములు బొరయని పదవికి
సాక్షిమాత్రుడవు నీవేనయా || ఓం ||

29. ఝమ్మను బ్రణవనాదములోపల
గ్రమ్మినవెన్నెల కాంతివయా || ఓం ||

30. టక్కరి జగమున మాయకులోబడి
చిక్కితి నిన్నెటుగాంతునయా || ఓం ||

31. డబ్బుకొరకు నిను జేరగలేదయా
మబ్బుదొలంగెడు మార్గమేదయా || ఓం ||

32. ఢంకాది మహానాదానందా
సంకటముల తొలగింపుమయా || ఓం ||

33. తలచి తలచి వేసారితి నీదయ
కలుగదాయె నిక నేమిసేతు || ఓం ||

34. తారకయోగము దారనెఱింగిన
ధన్యులు నీదయ గాంతురయా || ఓం ||

35. దరిజేరుట యిక నెన్నడు తండ్రి
తాపమాయెనిక తాళజాల || ఓం ||

36.దారుణమగు నీ సంసారాంబుధి
తీరము కోరగజాలనయా || ఓం ||

37. దుఃఖము తొలగెడు మార్గము నామది
తోపగజేయర దురితహరా || ఓం ||

38. దండము దండము నీ పాదములకు
భండనభీమా భవహరహర || ఓం ||

39. ధనధాన్యంబులు దారసుతాదులు
గనుగొనసర్వము మాయేనయా || ఓం ||

40. నరకస్వర్గము లాదిద్వంద్వముల
బొరయని తత్త్వమె స్థిరమయ్యా || ఓం ||

41. నానారూపములందియు దేనిని
నంటక వెలిగెద నద్భుతముగ || ఓం ||

42. నిజముగ నిను మది నెఱిగిన దాసులు
నిఖిల మెఱింగిన వారెనయా || ఓం ||

43. నీవే కర్తవు నీవే భర్తవు
నీవే హర్తవు నీవేనయా || ఓం ||

44. నీవే యజుడవు నీవే విష్ణువు
నీవే హరుడవు నిరుపమగుణ || ఓం ||

45. నీకంటె పరదైవము లేదుర
నిన్నే గొలిచెద నిర్ద్వంద్వా || ఓం ||

46. నేను నీవెవడు ద్వైతము దొలగిన
నీవే నేనై యుందునయా || ఓం ||

47. నీవే నేనై నెగడిన తదువరి
నేమియు తెలుపగ జాలనయా || ఓం ||

48. అన్ని మతంబులు కాదిమూలమిది
కన్న జన్మమిక సున్నయ్యా || ఓం ||

49. ఆనందము దివ్యానందము
బ్రహ్మానందము పరమానందము || ఓం ||

50. పలుమరు నిను మదిగొలిచెడు ఘనులకు
కలిగెడు భాగ్యమిదేనయ్యా || ఓం ||

51. పాపవిదూరము పంచాక్షరి మది
పఠనము సేతుర భవభయహర || ఓం ||

52. ఫలము గోరక కర్మలచేసిన
కలిగెడు సత్ఫల మధికమయా || ఓం ||

53. భజనచేసిన భక్తుల కెల్లను
పాపము దొలగుట సులభమయా || ఓం ||

54. భూరి ఘోరసంసార మహాంబుధి
తీరముజేరగ దారిగదా || ఓం ||

55. మర్మము దెలిసిన మహనీయులకును
కర్మము భస్మము జెందుకదా || ఓం ||

56. మౌనముతో నీమంత్రము మదిలో
ధ్యానము జేయుటె జ్ఞానమయా || ఓం ||

57. మూర్ఖులకందని మునిజనవందిత
మోక్షసాధనము ఇదేగదా || ఓం ||

58. మహదేవా హర శంభో
నీదగు మహాత్యమేమని యెంతునయా || ఓం ||

59. ముందుగ నీదయ కల్గిననాపై
మోక్షము జెందుట సులభమయా || ఓం ||

60. యతిజనవందిత నీవేగతియని
సతతము గొలిచెద సాంబశివా || ఓం ||

61. రజతాచలమున కధినాధుండవు
రాజరాజప్రియ రాజధరా || ఓం ||

62. రామతారకము బోధనచేసి
రాజితగురుడవు నీవేనయా || ఓం ||

63. రాతిరి బవలునులేని స్థలంబున
రంజిలుచుండెడు పాతకహర || ఓం ||

64. రూపమునామము విలయమునందిన
దాపున వెలిగెడు ధన్యగుణా || ఓం ||

65. లవలేశంబును ఘనమునుగాని
విలక్షణమూర్తి విలాసమయా || ఓం ||

66. వశమౌనే నిను బొగడగ నాకిక
పశుపతి సర్వము నీవేనయా || ఓం ||

67. వాదము భేదము మోదము భేదము
లేదని దెలిపిన రాధికజన్మము || ఓం ||

68. వింటిని నీయశ మంటిని శరణని
కంటకములు ముక్కంటివి బాపు || ఓం ||

69. వీనులవిందుగ నీచరితంబును
విన్న భవంబులు మన్నెనుర || ఓం ||

70. వేషము లెన్నో వేసిన ఘనమా
శేషభూష నిను జేరకున్న || ఓం ||

71. వైరము, కామము, లోభము వదలిన
ధీరులకే యీ దారిగదా || ఓం ||

72. వేదములే నిను గనుగొనజాలక
వెదకిన నీఘన మేమయ్యా || ఓం ||

73. శమదమాదిగుణజాలము లేకను
శక్యముగాదుర నిను గనుటకు || ఓం ||

74. శాంతి శాంతియను మంత్రము నిరతము
చవినెఱింగి జపియింతుమయా || ఓం ||

75. శుచిగా ప్రణవము భావనజేసిన
శుద్ధులు నిను మది గాంతురయా || ఓం ||

76. శౌరికి ప్రియుడవు సర్వగురుండవు
సాంబశివుండవు సాధుపాల || ఓం ||

77. శైలసుతాహృదయాంబుజ భాస్కర
శూలపాణిదయ జూడుమయా || ఓం ||

78. శోభనగుణగణ నీనామమురుచి
చూచిన నమృతమికేలనయా || ఓం ||

79. షణ్ముఖజనక సురాసురవందిత
సామజచర్మాంబరధరహర || ఓం ||

80. సకలము నీవై సాక్షిగనుండెడు
జాడనెఱింగిన జాలునయా || ఓం ||

81. సాకారంబు నిరాకారంబును
నేకమైన తెరువిదేనయా || ఓం ||

82. సీతాపతివరనామమ నీయెడ
సిద్ధిగాంచుట ప్రసిద్ధమయా || ఓం ||

83. హరహర తారకమంత్రస్వరూపము
అరక్షణంబును మఱువనయా || ఓం ||

84. క్షరాక్షరంబుల కవ్వలిపదవికి
జాడనెఱుంగగజేయుమయా || ఓం ||

85. శివశివ నీపదచింతన గలిగిన
సిద్ధము మోక్షము సిద్ధమయా || ఓం ||

86. శూలిమహేశ్వర నాపై నింకను
జాలిగనులగదది యేలనయా || ఓం ||

87. శంకరనీదగు కింకరుడనునా
సంకటముల తొలగింపుమయా || ఓం ||

88. మృత్యుంజయ భూతేశ్వరమాకిక
మృత్యుభయము తొలగింపుమయా || ఓం ||

89. చంద్రశేఖరాసాంద్రదయాకర
శరణాగత జనరక్షణగుణ || ఓం ||

90. ప్రమధాధివ నీ పాదపద్మముల
ప్రణుతిజేతు దయజూడుమయా|| ఓం ||

91. శ్రీ కంఠ శితికంఠా నినుసుతి
జేసిన జన్మము ధన్యమయా || ఓం ||

92. వాసుదేవ త్రిపురాంతక వృషభ
సువాహనయుత మాంపాహి పాహి || ఓం ||

93. వ్యోమకేశ భవ భీమయనుచు
నీనామభజన నేమరనయ్యా || ఓం ||

94. గంగాధర నీ పాదములకిదే
సాష్టాంగ నమస్కారమయా || ఓం ||

95. తారక సాంఖ్యామనస్క యోగ
విచార సుందరాకార హరా || ఓం ||

96. నీవే తల్లివి నీవే తండ్రివి
నీవే గురుడవు నిజమయ్యా || ఓం ||

97. బాలుడ నీదయవాల వహించియు
మేలుగ నను దయ నేలుమయా || ఓం ||

98. తప్పులు సైచెడు దాతవు నీవని
తలచి వినుతి జేసితినయా || ఓం ||

99. తెలిసితి నీదగు మహిమనుయిక నా
తలపు నీపయిని తప్పదయా || ఓం ||

100. అద్వైతంబున నమృతము గ్రోలగ
నాధారము నీనామమయా || ఓం ||

101. హృదయకమలమున కుదురుగ నిలిచియు
ముదము వొసంగర సదయుడవై || ఓం ||

102. శరణము శరణము శరణము భవహర
జయజయ శంభో సాంబశివా || ఓం ||

103. వ్యాసాశ్రమమున వాసిగ వెలుగుచు
దాసుల బ్రోచే దాతవయా || ఓం ||

104. భక్తాశ్రమమున తేజరిల్లుచును
భక్తులు గాచే శక్తివయా || ఓం ||

105. శ్రీ మలయాళ సద్గురువర్యుల
చరణాంబుజముల గొలుతునయా || ఓం ||

106. నాగలింగధర భక్తజనోద్ధర
నన్నిక మఱువగ వలదయ్యా || ఓం ||

107. వరదదాసహృదయాంబుజ భాస్కర
హరహరహరహరహరహర || ఓం ||

108. మంగళమగు జయ మంగళమగు శుభ
మంగళమగు హర మంగళకర || ఓం ||


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!