పూర్వాంగం చూ. ||
శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||
సంకల్పం–
తచ్చశ్రావణ శుక్ల పంచమ్యాం సువాసినీభిః కార్యం తస్యా యంప్రయోగః ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థై ర్యాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్ద కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం దీర్ఘసువాసినీత్వి సిద్ద్యర్థం సమస్తమంగళా వాప్త్యధర్థం వర్షే వర్షే ప్రయుక్తఫణిగౌరీ దేవతా ముద్దిశ్య ఫణి గౌరీదేవతా ప్రీత్యర్థం గౌరీపూజాంకరిష్యే| అదౌకలశ గణపతి పూజాంకృత్వా |
ధ్యానం–
ఆగచ్ఛదేవ దేవేశి శంకరార్ధశరీరిణి ఆవాహయామి భక్త్యాత్వా ఫణిగౌరనమోస్తుతె ఫణీగౌరీ దేవతాయైనమః ఆవాహనం సమర్పయామి|
సింహాసనం–
మాణిక్య వజ్రవైడూర్య నీలరత్నాదిశోభీతః|
రత్న సింహాసనం దివ్యం గృహాణపరమేశ్వరి
అర్ఘ్యం–
గంగా జలసమాయుక్తంసుగంధంగంధసంయుతం గృహాణార్ఘ్యంమయా దత్తం మంగళం కురుమెశివె
పాద్యం–
పుణ్యతీర్థ సమానితం పవిత్రం ద్రవ్యసంయుతం |
పాద్యంచ ప్రతిగృహ్ణాతు గౌరి దేవి నమోస్తుతెః
ఆచమనం–
సర్వతీర్థ సముద్భూతం పవిత్రమమలజలం గృహాణాచ మనం దేవి ఫణిగౌరి నమోస్తుతె
పంచామృతస్నానం–
పయోదధిసమాయుక్తం ఘృతశర్కర సంయుతం | పంచామృత స్నానమిదం గృహాణాసుర మర్ధనీ || పంచామృత స్నానం ఆపోహిష్టేతి శుద్ధోదక స్నానం ||
వస్త్రం-
రక్తపీత మయంవస్త్రం దుకూలంచమనోహరం మయాదతమిదంవస్త్రం దార్యతాంభండమర్దనీ
యజ్ఞోపవీతిం–
బ్రహ్మ సూత్రంశుభ్రమిదం త్రిగణంత్రగుణైర్యుతం, బ్రహ్మగ్రంధియుతిం దేవి దారయస్వమహేశ్వరి
మంగళసూత్ర–
మాంగల్యమణిసంయుక్తం ముక్తాఫల సమన్వితం దత్తం మంగళసూత్రం తె గృహాణ గిరిశ ప్రియె
ఆభరణం–
గౌరిమిమా యేతికుంకుమాది పరిమళద్రవ్యాణి ముక్తామాణిక్యవైడూర్య రత్న హేమాదినిర్మితం. దివ్యమాభరణం దేవి గిరిజాయై నమోస్తుతే
శ్రీగంధం–
శ్రీగంధంచందనోన్మిశ్రం కస్తూర్యాదిసమన్వితం గంథంగృహాణ దేవేశి మయాదత్తమిదంశుభే
అక్షతాన్–
అక్షతాన్ధవళాకారాన్ శాలీతండులమిశ్రితాన్ |
హరిద్రాచూర్ణ సంయుక్తా ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం |
పుష్పాణి–
చంపకాకుందమందార పున్నాగ బృహతీయుతైః పుష్పైబిల్వదళోపేతై పూజయామిశివప్రియాం
|| అధాంగ పూజా||
శివాయై నమః – పాదౌ పూజయామి
భవాన్యై నమః – గుల్భౌ పూజయామి
రుద్రాణ్యై నమః– ఊరూ పూజయామి
శర్వాణ్యై నమః– జంఘే పూజయామి
సర్వమంగళాయై నమః– కటిం పూజయామి
అపర్ణాయై నమః – స్తనౌ పూజయామి
మృదాన్యై నమః– కంఠం పూజయామి
చండికాయై నమః– బాహూ పూజయామి
ఆర్యాయై నమః– ముఖం పూజయామి
సత్యై నమః– నాసికం పూజయామి
సునేత్రాయై నమః– నేత్రే పూజయామి
సుకర్ణాయై నమః– కర్ణౌ పూజయామి
మేనకాత్మజాయై నమః– లలాటం పూజయామి
ఫణిగౌర్యై నమః– శిరః పూజయామి
మహాగౌర్యై నమః– సర్వాంగాణి పూజయామి
అష్టోత్తర శతనామ పూజా
ఓం మహాగౌర్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం సరస్వత్యైనమః |
ఓం చండికాయైనమః |
ఓం లోకజనన్యైనమః |
ఓం సర్వ దేవాది దేవతాయైనమః |
ఓం పార్వత్యై నమః |
ఓం పరమాయై నమః |
ఓం ఈశాయై నమః |
ఓం నగేంద్రతనయాయై నమః |
ఓం బ్రహ్మచారిణ్యై నమః |
ఓం శర్వాణ్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం త్రిలొచన్యై నమః |
ఓం బ్రహ్మణ్యే నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం కాళరాత్యై నమః |
ఓం తపస్విన్యై నమః |
ఓం శివదూత్యై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం విష్ణుసోదర్యై నమః |
ఓం చిత్కళాయై నమః |
ఓం చిన్మయాకారాయై నమః |
ఓం మహిషాసురమర్ధిన్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కాలరూపాయై నమః |
ఓం గిరిజాయై నమః |
ఓం మేనకాత్మజాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం మాతృకాయై
ఓం గౌర్యై నమః |
ఓం రమాయై నమః |
ఓం రామాయై నమః |
ఓం శుచిస్మితాయై నమః |
ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం రాజ్యలక్ష్యే నమః |
ఓం శివప్రియాయై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం మహాశక్యై నమః |
ఓం నవోఢాయై నమః |
ఓం భాగ్యదాయిన్యై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం సదానందాయై నమః |
ఓం యౌవనాయై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం జ్ఞానదశుధ్యై నమః |
ఓం జ్ఞానగమ్యాయై నమః |
ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కమలాకరాయై నమః |
ఓం రక్తవర్ణాయై నమః |
ఓం కళానిధ్యై నమః |
ఓం మథుప్రియాయై నమః |
ఓం కల్యాణ్యై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం గిరీంద్రజాయై నమః |
ఓం జనస్థానాయై నమః |
ఓం వీరపత్నై నమః |
ఓం విరూపాక్ష్యై నమః |
ఓం విరాధితాయై నమః |
ఓం హేమాషాయై నమః |
ఓం సృష్టిరూపాయై నమః |
ఓం సృష్టిసింహాంకారిణ్యై నమః |
ఓం రంజనాయై నమః |
ఓం యవనాకారాయై నమః |
ఓం పరమేశప్రియాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం పుష్పిణ్యై నమః |
ఓం పురుషాకారాయై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం మహాఐశ్వర్యై నమః |
ఓం మహరూపాయై నమః |
ఓం మహారౌద్ర్యై నమః |
ఓం మహాపాతకనాశిన్యై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం కామదేవ్యై నమః |
ఓం వరదాయై నమః |
ఓం భయనాశిన్యై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వచస్వ్వె నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం విశ్వమోహిన్యై నమః |
ఓం వర్ణనీలాయై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం అర్థదుఃఖచ్ఛేదదక్షాయై నమః |
ఓం అంబాయై నమః |
ఓం నిఖిలయోగిన్యై నమః |
ఓం సదాపురస్థాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం తరుమూలతలంగతాయై నమః |
ఓం హరినాహసమాయుక్తాయై నమః |
ఓం మునిమోక్షపరాయై నమః |
ఓం వరాయై నమః |
ఓం ధరాధరభవాయై నమః |
ఓం ముక్తాయై నమః |
ఓం పురమంత్రాయై నమః |
ఓం రప్రదాయై నమః |
ఓం కార్యై నమః |
ఓం వాగ్భవాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం క్లింకార్యై నమః |
ఓం సంవిదె నమః |
ఓం ఈశ్వర్యైనమః నమః |
ఓం హ్రీంకారాక్షరబీజాయైనమః |
ఓం శ్రీ ఫణీగౌరీ దేవతాయైనమః |
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
ధూపం–
వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ |
దీపం–
భక్త్యా దత్త మయాదీపం త్రిపర్తిఘృతసంయుతం | అంథకారనివృత్యర్థం గృహాణాజ్ఞాననాశినీ
|| పూర్వనీరాజనం ||
నైవేద్యం-
భక్ష్యైర్భోజ్యైస్స చోష్యైశ్చ పరమాన్నంసశర్కరం| నైవేద్యంగృహ్యతాం దేవిశంభు పత్నినమోస్తుతె
తాంబూలం-
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం|
దక్షిణా –
సౌవర్ణి దక్షిణాప్రోక్తా పూజాసాఫల్యకారణం || దక్షిణాంప్రతిగృహ్ణిష్వ దక్షిణేసర్వమంగళే
ఉత్తరనీరాజనం–
వాణీలక్ష్మిశచీ మౌళి నీరాజీతిపదాంబుజే| శివెనీరాజయామిత్వాం నిత్యలోకప్రకాశికాం
మంత్రపుష్పం–
పుష్పాంజలి ప్రయచ్ఛామి భక్తి పూర్వం సమంత్రకం | తేనపాపానినశ్యంతు మంగళేతవపాదయోః|| జాత వేద సునవామేతీమంత్రపుష్పం||
ప్రార్థనా-
యానికానిచేతి ప్రదక్షిణం|| ఫణిగారి నమస్తేస్తు కైలాసనిలయస్థితె |లోకమాతర్నమస్తుభ్యం సౌభాగ్యం దేహిమేసదా||
తోరబంధన మంత్రం–
దశగంధిసమాయుక్తం కుంకుమాక్తం సుదోరకం కరుబధ్నామివరదె తవప్రీతికరంశుభం||
తతోవాయన దానం|
ఫణిగౌరీచగృహ్ణాతు ఫణిగారీదదాతిచ | తారకాఫణిగారీచ ఫణీగౌరీసమోస్తుతే|| యస్యస్మృత్యా చేతిసమాపనం|| ఫణీగౌరీ దేవతా స్సుప్రీతావరదాభవతు ||
ఇతి పూజావిధానం సంపూర్ణమ్.
అధ కథా ప్రారంభః –
(హస్తేకుసుమాక్షతాన్ గృహీత్వాః)
సూతుల వారు చెప్పుచున్నారు —
“ఓ శౌనకాది మునీశ్వరులారా! వినండి — అన్ని వ్రతములలో ఉత్తమమైన వ్రతమును చెప్పెదను. ఈ వ్రతమును ఆచరించిన స్త్రీకి శుభములు సమకూడునని. ఈ వ్రతము శ్రావణ శుక్ల పంచమి దినంబున జరుపవలెను. ఇది ‘సువాసినీ వ్రతము’. అందులో సోదరవతి తప్పక జేయవలెను. ఈ వ్రతము పది సంవత్సరములు చేయతగినది.”
శౌనకుడు అను చున్నాడు —
“ఓ సూత మహర్షీ! ఇట్టి వ్రత రాజమును వినగోరితినిగాన నాకు చెప్పుము.”
సూతుడు —
“ఈ వ్రతమును సువాసినీ చేయవలయును. విశేషముగా ముఖ్యముగా సోదరవతి జేయుటముఖ్యం. శ్రావణ శుక్ల పంచమి తిధియందు ఉదయమున లేచి, పసుపుతో, సుమంగళ ద్రవ్యములతోను స్నానమాచరించి, ఉతికిన, ఆరవేసినబట్టను కట్టుకొనవలెను .
తరువాత ఫలపుష్పాదులతో మంటపము నిర్మించి, దాని మధ్య ముగ్గులు వేసి, ఆ మధ్య ఆసనమునుంచి దానిమధ్యను ముగ్గులు పెట్టి దాని మధ్యను ఆసనమునుంచి దానియందు పుష్పాక్షత సహితము బియ్యమునుబోసి బంగారముతోగాని వెండితోగాని రాగితోగాని సర్పము చేయించవలెను.శక్తి లేనిచో మృత్తికతోనైన చేయవచ్చు, కాని శక్తిని దాచకూడదు.యిట్లు జేసి ఆసర్ప మధ్యను గౌరీదేవినినుంచి ధ్యాన, ఆవాహన, అర్ఘ్య, పాద్య, పంచామృత, వస్త్ర భూషణ, గంధ, అక్షత, పుష్ప, ధూప, దీపములు నొసంగి సమర్పించవలెను.పిమ్మట షడ్రసోపేతమైన చతుర్విధాన్నము నివేదించి తాంబూల దక్షిణమంత్రపుష్పముల నియ్యవలయును.తరువాత ప్రదక్షిణ నమస్కారములు నాచరించి పదిముళ్ళతోగూడిన దోరమును బూజించి హస్తమందు కట్టుకొని బ్రాహ్మణునకు వాయనమిచ్చి దక్షిణతాంబూలము నిచ్చి తాను భోజనము చేయవ లెను.ఈ ప్రకారముగా పది సంవత్సరములు జేయవలెను.అట్లు ఆచరించిన స్త్రీకి సమస్థేష్టార్థములు సమకూడును దేహాంతమందు పతి లోకముగలుగును. ఆ స్త్రీని ఈలోక మందనేక భోగము ననుభవించి అంతమంతమందు మోక్షము బొందును.
శౌనకుడు —
“ఓ సూతమహర్షి గరుత్మంతుని జననమును కర్మలను పరాక్రములను వినగోరితిమిగాన చెప్పుము.”
సూతుడు —
“పూర్వకాలమందు బ్రహ్మపుత్రుడైన కశ్యప మహర్షికి సుపర్ణియను భార్య కలదు.ఈమెకు మహాబలశాలియైన గరుత్మంతుడు జన్మించెను”.
సపత్నికి దాస్యముచేస్తున్న తల్లిని చూచి, గరుత్మంతుడు — ‘ఓ అమ్మా, ఇది నీకు ఎందుకు వచ్చిందో, ఎట్లా నివృత్తి కలిగించాలో అని అడిగెను అమృతమును దెచ్చియిచ్చినచోతొలగునని తల్లి చెప్పెను.ఆ మాట విని గరుత్మంతుడు త్వరగా స్వర్గముకుబోయి, అమృతమును హరించ వలెనని ప్రయత్నించు చుండెను.
యింతలో ఇంద్రదులాయుధపాణులై గరుత్మంతునావరించిరి గరుడును తన రెక్క చేత వారినందరిని బారదోలిఅమృతము దెచ్చెను తెచ్చి సవతితల్లిని జూచి ఇదిగో అమృతమును దెచి
తినని జూపెను ఆకద్రువయు సుపర్ణినిజూచి నీదాస్యము తొలగిన నీవు యథేచ్ఛగా వెళ్ళుమనెను ఆమె యట్లు వెళ్ళెను గరుడునుయథేచ్ఛగా వెళ్ళేను. అంతలో ఇంద్రాదులు వచ్చి అమృత కలశమును పుచ్చుకొని తమలోకముకుబోయిరి యిట్టిచరిత్రలనేకములుగలవు గరుడుని జన్మ మాహాత్మ్మములను మీకు జెప్పితిని శ్రావణ శుక్ల పంచమినాడు గరుడుని జన్మగాన యిది గుడపంచమీ యనఁబడుచున్నది.
ఈవ్రతము నెవ్వరాచరించెదరో యెవ్వరీకథను పఠించెదరో వారందరుపాపమొందక పరమపదమును బొందుదురు.
ఇతి శ్రీ భవిష్యోత్తర పురాణే గరుడ పంచమీ ప్రతకల్పం సంపూర్ణము.