అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || 1 ||
ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ |
సైంహికేయం కరాళాస్యం భక్తానామభయ ప్రదమ్ || 2 ||
శూర్పాకారాసన స్థశ్చ గోమేధాభరణప్రియః |
మాషప్రియః కాశ్యపర్షి నందనోభుజగేశ్వరః || 3 ||
ఆరోగ్యమాయు రఖిలాంశ్చ మనోరథార్దాన్ |
తమోరూప నమస్తుభ్యం ప్రసాదం కురుసర్వదా || 4 ||
కరాళవదనం ఖడ్గ చర్మశూల వరాన్వితమ్ |
నీలసింహాసనం ధ్యాయేత్ రాహుం తం చ ప్రశాంతయే || 5 ||