Skip to content

Sri Hari Nama Mala Stotram in Telugu – శ్రీ హరి నామమాలా స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

గోవిందం గోకులానందం గోపాలం గోపివల్లభమ్ |
గోవర్ధనోద్ధరం ధీరం తం వందే గోమతీప్రియమ్ || ౧ ||

నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమమ్ |
నృసింహం నాగనాథం చ తం వందే నరకాంతకమ్ || ౨ ||

పీతాంబరం పద్మనాభం పద్మాక్షం పురుషోత్తమమ్ |
పవిత్రం పరమానందం తం వందే పరమేశ్వరమ్ || ౩ ||

రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిమ్ |
రాజీవలోచనం రామం తం వందే రఘునందనమ్ || ౪ ||

వామనం విశ్వరూపం చ వాసుదేవం చ విఠ్ఠలమ్ |
విశ్వేశ్వరం విభుం వ్యాసం తం వందే వేదవల్లభమ్ || ౫ ||

దామోదరం దివ్యసింహం దయాళుం దీననాయకమ్ |
దైత్యారిం దేవదేవేశం తం వందే దేవకీసుతమ్ || ౬ ||

మురారిం మాధవం మత్స్యం ముకుందం ముష్టిమర్దనమ్ |
ముంజకేశం మహాబాహుం తం వందే మధుసూదనమ్ || ౭ ||

కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియమ్ |
కౌమోదకీధరం కృష్ణం తం వందే కౌరవాంతకమ్ || ౮ ||

భూధరం భువనానందం భూతేశం భూతనాయకమ్ |
భావనైకం భుజంగేశం తం వందే భవనాశనమ్ || ౯ ||

జనార్దనం జగన్నాథం జగజ్జాడ్యవినాశకమ్ |
జామదగ్న్యం పరం జ్యోతిస్తం వందే జలశాయినమ్ || ౧౦ ||

చతుర్భుజం చిదానందం మల్లచాణూరమర్దనమ్ |
చరాచరగురుం దేవం తం వందే చక్రపాణినమ్ || ౧౧ ||

శ్రియఃకరం శ్రియోనాథం శ్రీధరం శ్రీవరప్రదమ్ |
శ్రీవత్సలధరం సౌమ్యం తం వందే శ్రీసురేశ్వరమ్ || ౧౨ ||

యోగీశ్వరం యజ్ఞపతిం యశోదానందదాయకమ్ |
యమునాజలకల్లోలం తం వందే యదునాయకమ్ || ౧౩ ||

సాలగ్రామశిలాశుద్ధం శంఖచక్రోపశోభితమ్ |
సురాసురైః సదా సేవ్యం తం వందే సాధువల్లభమ్ || ౧౪ ||

త్రివిక్రమం తపోమూర్తిం త్రివిధాఘౌఘనాశనమ్ |
త్రిస్థలం తీర్థరాజేంద్రం తం వందే తులసీప్రియమ్ || ౧౫ ||

అనంతమాదిపురుషమచ్యుతం చ వరప్రదమ్ |
ఆనందం చ సదానందం తం వందే చాఘనాశనమ్ || ౧౬ ||

లీలయా ధృతభూభారం లోకసత్త్వైకవందితమ్ |
లోకేశ్వరం చ శ్రీకాంతం తం వందే లక్ష్మణప్రియమ్ || ౧౭ ||

హరిం చ హరిణాక్షం చ హరినాథం హరప్రియమ్ |
హలాయుధసహాయం చ తం వందే హనుమత్ప్రియమ్ || ౧౮ ||

హరినామకృతా మాలా పవిత్రా పాపనాశినీ |
బలిరాజేంద్రేణ చోక్తా కంఠే ధార్యా ప్రయత్నతః ||

ఇతి బలిరాజేంద్రేణోక్తం శ్రీ హరి నామమాలా స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!