Skip to content

Vinayaka Chavithi Pooja Vidhanam in Telugu – గణేశ చతుర్థి పూజా విధానం (శ్రీ సిద్ధి వినాయక వ్రత కల్పం)

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

అయం ముహూర్తస్సుముహూర్తోఽస్తు |
తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి, సుముహూర్తోఽస్తు |

యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా |
తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః |
యేషామిందీవరశ్ష్యామో హృదయస్థోజనార్థనః ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహమ్ ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||

ధూమ్రకేతు-ర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ-శ్శూర్పకర్ణో హేరంబ-స్స్కందపూర్వజః ||

షోడశైతాని నామాని యః పఠే-చ్ఛృణు-యాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||

అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి |
సర్వవిఘ్నచ్చిదేతస్మై శ్రీ మహాగణాధిపతయే నమః ||

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః |
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః |
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః |
ఓం శచీపురందరాభ్యాం నమః |
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః |
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||
నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త-స్సుముహూర్తోఽస్తు ||

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం స॒త్యమ్ |
ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ||
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ||

సంకల్పః

(సంకల్పము చెప్పునపుడు ఎడమ అరచేతిని కుడి అరచేతితో పట్టుకుని కుడి తొడ పై పెట్టి ఈ క్రింది సంకల్పము చెప్పవలెను)
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర-ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహం … మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబస్య, క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్హ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే |

కలశ పూజ
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర-స్సమాహితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః ||

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వ్వీపా వసుంధరా |
ఋగ్వేదోధ యజుర్వేద-స్సామవేదో-హ్యధర్వణః ||
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః |

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః |
(కలశోదకేన పూజాద్రవ్యాణి, ఆత్మానం, దేవం చ సంప్రోక్ష్య)

ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్ | జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయే నమః |
అథ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే |

|| వినాయక పూజా ప్రారంభః ||

ప్రార్థన
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ |
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ||

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ |
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ||

షోడశోపచార పూజా

ధ్యానం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |

అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |

పాద్యం
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |

ఆచమనీయం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ |
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి |

అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ |
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి |

అథాంగపూజా
ఓం పార్వతీనందనాయ నమః – పాదౌ పూజయామి |
ఓం గణేశాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం జగద్ధాత్రే నమః – జంఘే పూజయామి |
ఓం జగద్వల్లభాయ నమః – జానునీ పూజయామి |
ఓం ఉమాపుత్రాయ నమః – ఊరూ పూజయామి |
ఓం వికటాయ నమః – కటిం పూజయామి |
ఓం గుహాగ్రజాయ నమః – గుహ్యం పూజయామి |
ఓం మహోత్తమాయ నమః – మేఢ్రం పూజయామి |
ఓం నాథాయ నమః – నాభిం పూజయామి |
ఓం ఉత్తమాయ నమః – ఉదరం పూజయామి |
ఓం వినాయకాయ నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం పాశచ్ఛిదే నమః – పార్శ్వే పూజయామి |
ఓం హేరంబాయ నమః – హృదయం పూజయామి |
ఓం కపిలాయ నమః – కంఠం పూజయామి |
ఓం స్కందాగ్రజాయ నమః – స్కంధౌ పూజయామి |
ఓం హరసుతాయ నమః – హస్తౌ పూజయామి |
ఓం బ్రహ్మచారిణే నమః – బాహూన్ పూజయామి |
ఓం సుముఖాయ నమః – ముఖం పూజయామి |
ఓం ఏకదంతాయ నమః – దంతౌ పూజయామి |
ఓం విఘ్ననేత్రే నమః – నేత్రే పూజయామి |
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి |
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి |
ఓం నాగాభరణాయ నమః – నాసికాం పూజయామి |
ఓం చిరంతనాయ నమః – చుబుకం పూజయామి |
ఓం స్థూలోష్ఠాయ నమః – ఓష్ఠౌ పూజయామి |
ఓం గళన్మదాయ నమః – గండే పూజయామి |
ఓం కపిలాయ నమః – కచాన్ పూజయామి |
ఓం శివప్రియాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వమంగళాసుతాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

ఏకవింశతి పత్రపూజ
ఓం ఉమాపుత్రాయ నమః – మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయ నమః – బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయ నమః – బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
ఓం ద్విరదాననాయ నమః – దూర్వాపత్రం సమర్పయామి (గరిక) |
ఓం ధూమకేతవే నమః – ధత్తూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే నమః – బదరీపత్రం సమర్పయామి (రేగు) |
ఓం అపవర్గదాయ నమః – అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం ద్వైమాతురాయ నమః – తులసీపత్రం సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ నమః – చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయ నమః – కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
ఓం విష్ణుస్తుతాయ నమః – విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ నమః – దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయ నమః – ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః – మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధూరాయ నమః – సింధువార పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయ నమః – జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
ఓం గండగళన్మదాయ నమః – గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
ఓం శంకరప్రియాయ నమః – శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
ఓం భృంగరాజత్కటాయ నమః – అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
ఓం అర్జునదంతాయ నమః – అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ నమః – అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |

ఏకవింశతి పుష్ప పూజా
ఓం పంచాస్య గణపతయే నమః – పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః – మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః – దాడిమీ పుష్పం సమర్పయామి |
ఓం విష్వక్సేన గణపతయే నమః – వకుళ పుష్పం సమర్పయామి |
ఓం ఆమోద గణపతయే నమః – అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ గణపతయే నమః – పాటలీ పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర గణపతయే నమః – ద్రోణ పుష్పం సమర్పయామి |
ఓం విద్యా గణపతయే నమః – ధత్తూర పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న గణపతయే నమః – చంపక పుష్పం సమర్పయామి |
ఓం దురిత గణపతయే నమః – రసాల పుష్పం సమర్పయామి |
ఓం కామితార్థప్రద గణపతయే నమః – కేతకీ పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ గణపతయే నమః – మాధవీ పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు గణపతయే నమః – శమ్యాక పుష్పం సమర్పయామి |
ఓం ఈశ గణపతయే నమః – అర్క పుష్పం సమర్పయామి |
ఓం గజాస్య గణపతయే నమః – కల్హార పుష్పం సమర్పయామి |
ఓం సర్వసిద్ధి గణపతయే నమః – సేవంతికా పుష్పం సమర్పయామి |
ఓం వీర గణపతయే నమః – బిల్వ పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప గణపతయే నమః – కరవీర పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః – కుంద పుష్పం సమర్పయామి |
ఓం బ్రహ్మ గణపతయే నమః – పారిజాత పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన గణపతయే నమః – జాతీ పుష్పం సమర్పయామి |

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా
ఓం గణాధిపాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం పాశాంకుశధరాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఆఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం వినాయకాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మూషకవాహనాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కుమారగురవే నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిలవర్ణాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం బ్రహ్మచారిణే నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మోదకహస్తాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురశ్రేష్ఠాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజనాసికాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిత్థఫలప్రియాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజముఖాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సుప్రసన్నాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురాగ్రజాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం స్కందప్రియాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి |

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి |

శ్రీ వినాయక అష్టోత్తరశత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః (30)
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః (40)
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధాయ నమః
ఓం సర్వవంద్యాయ నమః (50)
ఓం నర్వసిద్ది-ప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసుర-భంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః (60)
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః (70)
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంత-పదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః (80)
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్క్షిప్త-వారణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః (90)
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః (100)
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షా-విధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
శ్రీ మహాగణాధిపతయే నమః |
నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి |

ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి |

నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |

నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ||
ఏకదంతైకవదన తథా మూషకవాహన |
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |

ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |

రాజోపచార పూజా
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | చామరైర్వీజయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గీతం శ్రావయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | నృత్యం దర్శయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | వాద్యం ఘోషయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | అశ్వాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గజాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ |

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక |
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ |

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ |

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ |

సమర్పణం
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

వినాయక వ్రత కథ

సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలు పెట్టాడు.

ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో వున్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమ శివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు.

అప్పుడు గజాసురుడు “స్వామీ, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే వుండాలి” అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే వుండటం మొదలు పెట్టాడు.

ఇదిలా వుంటే, కైలాసం (శివుడి ఇల్లు)లో వున్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంది. కానీ, శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి, చివరికి విష్ణుమూర్తిని ప్రార్ధించి, తన భర్త విషయం చెప్పింది.

“ఓ మహానుభావా, పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు” అని కన్నీళ్ళు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీ దేవిని ఓదార్చి పంపేశాడు.

అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చం పేందుకు గంగి రెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు.

శివుడి వాహనం నందిని ఒక గంగి రెద్దుగా చేసి, బ్రహ్మ మొదలైన దేవతల చేత తల కొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరు గంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు వుండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగి రెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, “మీకు ఏం కావాలో కోరుకోండి. నేను ఇస్తాను” అని చెప్పాడు.

అప్పుడు శ్రీహరి “ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు” అని కోరాడు.

ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగి రెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని, తనకు చావు తప్పదని అర్ధం చేసుకున్నాడు. అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని “నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా వుండాలి. నా చర్మం నువ్వు ధరించాలి” అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా, లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు.

హరి శివుడితో “చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది” అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.

వినాయకుడి పుట్టుక

కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.

ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు.

లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి, కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి ‘గజాననుడు’ అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు.

గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలి అతని వాహనము.

విఘ్నేశాధిపత్యము 

ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి, “విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి” అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వుండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా వుంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు.

శివుడు వారితో “మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను” అని చెప్పాడు.

కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలూ తిరగటానికి వెళ్లిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి “అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని. నాయందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి” అని కోరుకున్నాడు.

శివుడు “నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్ధాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది” అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి మూడు కోట్ల ఏభై లక్షల నదులో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు.

ఇది చూసి ఆశ్చర్యపోయి, కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర వున్న అన్నను చూసి, నమస్కరించి, తన బలాన్ని తిట్టుకుని “తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్ధించాడు.

భాద్రపద శుద్ధ చతుర్ధి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశములవాళ్ళూ విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటి పళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని, నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు.

తల్లి తండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ, చేతులు మాత్రం భూమిమీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆన్చినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద వున్న చంద్రుడు పగలబడి, ఎగతాళిగా నవ్వాడు. ‘రాజదృష్టి సోకితే, రాళ్ళు కూడా నుగ్గవుతాయి’ అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల వున్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు.

పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు” అని శపించింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు 

అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించి, మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకూ బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపం తప్ప, మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో వున్న స్వాహా దేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు.

శాపం ఫలితంగానే ఋషి పత్నులకు ఈ నిలాపనింద కలిగింది. దేవతులు, మునులు, ఋషి పత్నులు

ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్ని దేవుడి భార్యే ఋషి పత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామ హేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు.

అప్పుడు దేవతలు, మిగిలినవాళ్ళు “పార్వతీ, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో వున్న వారికి కీడు జరుగుతోంది. కాబట్టి దానిని ఉపసంహరించు” అని ప్రార్ధించారు. –

వారి ప్రార్ధనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి “ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ ఒక్క రోజు మాత్రము చంద్రుని చూడకూడదు” అని చెప్పింది.

అప్పుడు బ్రహ్మ, మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్ధిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా వున్నారు.

ఈ విధంగా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానము

ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, ప్రార్ధించి మాట్లాడుతూండగా “స్వామీ, సాయం కాలం అయింది. ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి” అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు.

అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీ కృష్ణుడు క్షీర ప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వేపు చూడకుండా పశువులశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి “ఆహా! నాకు ఎలాంటి ఆపద రానుందో” అని అనుమానించటం ప్రారంభించాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీ కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు “ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివితక్కువవాడు ఇవ్వడు” అన్నాడు. శ్రీ కృష్ణుడు ఊరుకున్నాడు.

ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా, ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, ఆ మణిని తీసుకుని తాను వుండే కొండ బిలానికి వెళ్ళి, తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది.

మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని “నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీ కృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు” తన పట్టణంలో చాటింపు వేయించాడు.

శ్రీ కృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి, దానిని తొలగించుకొనేందుకు బంధు మిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలి జాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి, అక్కడ ఉయ్యాలకి కట్టబడి వున్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా, అది చూసి వింతమనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది.

అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి, అరుస్తూ, గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడి పై యుద్ధం ప్రారంభిచాడు. శ్రీ కృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణసంహారి అయిన శ్రీరామ చంద్రుడే అని అర్ధం చేసుకుని, నమస్కరించి “దేవాదిదేవా! ఆర్త జన రక్షకా! నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామ చంద్రుడని అర్ధం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది

మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్చ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు” అంటూ ప్రార్ధించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి “జాంబవంతా! శమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు. నేను వెళ్ళిపోతాను” అని చెప్పాడు.

అప్పుడు జాంబవంతుడు శ్రీ కృష్ణునికి మణితో పాటు, తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి,

అందరిని పిలిచి జరిగినదంతా వివరించి, మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు “అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను” అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి, తన తప్పు క్షమించమని వేడుకున్నాడు.

శ్రీ కృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతీ, సత్య భామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీ కృష్ణుడిని స్తుతించి “మీరు సమర్ధులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు. మాలాటి వారు ఏమి చేయగలరు?” అని ప్రార్థించారు.

అప్పుడు శ్రీ కృష్ణుడు “భాద్రపద శుద్ధ చతుర్ధిలో ప్రమాదవశాత్తూ చంద్రుని దర్శనమైతే, ఆరోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా వుంటారు” అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగువారు గణపతిని పూజించి, తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా వున్నారని – శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత, సూత – మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

గమనిక : చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||

సర్వేజనాస్సుఖినోభవంతు |

వినాయక మంగళాచరణం:

ఉ || తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్ధన జేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!

క || తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్

అటుకులు కొబ్బరి పలుకులు
చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షునగ్ర సుతునకు
పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు |
కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు
| జయ మంగళం నిత్య శుభ మంగళమ్ |

వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు కలియబోసి |
మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు ధవళారతి || జయ ||

శ్రీమూర్తివంద్యునకు చిన్మయానందునకు – భాసురస్తోత్రునకు శాశ్వతునకు |
సోమార్కనేత్రునకు సుందరాకారునకు – కామరూపునకు శ్రీ గణనాధునకును || జయ ||

ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయిన తొండంబు వలపు కడుపు |
జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను |
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ ||

ఉద్యా పన:>> 


మరిన్ని  శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!